CM Jagan: గత ప్రభుత్వాలు చేయని విధంగా మత్స్యకారులకు ఆర్థిక లబ్ధి: జగన్‌

 ‘వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా’ పథకం కింద ఐదో ఏడాది నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో నిధులను విడుదల చేసిన అనంతరం ఓడరేవు ఫిషింగ్‌ హార్బర్‌, ఆక్వా పార్కుకు ఆయన శంకుస్థాపన చేశారు. 

Updated : 16 May 2023 13:21 IST

నిజాంపట్నం: ‘వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా’ పథకం కింద ఐదో ఏడాది నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో నిధులను విడుదల చేసిన అనంతరం ఓడరేవు ఫిషింగ్‌ హార్బర్‌, ఆక్వా పార్కుకు ఆయన శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేయని విధంగా మత్స్యకారులకు ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థికసాయం అందజేస్తున్నామని చెప్పారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.10వేల చొప్పున సాయం అందించి వారిని ఆదుకుంటున్నామన్నారు. ఈ ఏడాది రూ.123 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఈ ఒక్క పథకం కిందే రూ.538 కోట్లు అందజేశామని తెలిపారు.  

చంద్రబాబు, పవన్‌పై విమర్శలు

మత్స్యకార భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై సీఎం జగన్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. తాను చేసిన మంచిని, ప్రజల్ని, దేవుడిని నమ్ముకుంటే.. వారిద్దరూ మాత్రం పొత్తులను నమ్ముకున్నారని విమర్శించారు. చంద్రబాబు స్క్రిప్ట్‌ ప్రకారం సినిమాల మధ్య విరామం దొరికినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై బురదచల్లడమే పవన్‌ పని అని ఆరోపించారు. పేదవాడికి మంచి జరుగుతుంటే వారు తట్టుకోలేకపోతున్నారని జగన్‌ విమర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని