CM Jagan: ఏపీని నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా మార్చాలి: జగన్‌ ఆదేశం

ఏపీలో అక్రమ మద్యం, గంజాయి సాగుకు వ్యతిరేకంగా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఎస్‌ఈబీ, ఆబ్కారీశాఖపై ఇవాళ ఆయన సమీక్ష నిర్వహించారు.

Published : 19 Dec 2022 16:16 IST

అమరావతి: ఏపీని నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగం ఉండకూడదన్నారు. ఎస్‌ఈబీ, ఆబ్కారీ శాఖపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్‌ రహిత రాష్ట్రం కోసం పోలీసు, ఆబ్కారీ శాఖ కలిసి పని చేయాలని అధికారులకు సూచించారు. నార్కొటిక్స్‌కు వ్యతిరేకంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో భారీ హోర్డింగ్స్‌ పెట్టాలన్నారు. ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నెంబర్‌ను బాగా ప్రచారం చేయాలని కోరారు. అక్రమ మద్యాన్ని అరికట్టాలని, గంజాయి సాగు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దిశ చట్టం, యాప్‌ ఇంకా సమర్థంగా అమలు కావాల్సిన ఆవశ్యకతను సీఎం గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని