CM Jagan: ఆ మాట ఎక్కడా వినిపించకూడదు.. అధికారులు సవాల్‌గా తీసుకోవాలి: సీఎం జగన్‌

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నట్లు తెలిపారు. రైతులకు గరిష్ఠ ప్రయోజనాలు అందించేలా ధాన్యం సేకరణ కొనసాగాలని చెప్పారు.

Published : 08 Nov 2022 01:25 IST

అమరావతి: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు రైతులు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా రాకూడదని, దీన్ని అధికారులు సవాల్‌గా తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నట్లు తెలిపారు. రైతులకు గరిష్ఠ ప్రయోజనాలు అందించేలా ధాన్యం సేకరణ కొనసాగాలని చెప్పారు. ఇ-క్రాపింగ్‌ డేటా ఆధారంగా ధాన్యం సేకరణ కొనసాగాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. మంత్రులు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు ఈ  సమావేశంలో పాల్గొన్నారు.

‘‘వ్యవసాయ శాఖతో పౌరసరఫరాల శాఖ అనుసంధానమై రైతులకు మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలి. రబీకి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి. ఎరువులు, విత్తనాలు, సహా రైతులకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాలి. ఈ నెల 29న సున్నా వడ్డీ పంట రుణాలతో పాటు ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ చేయాలి. ప్రతి ఆర్బీకేలో ఒక డ్రోన్‌ను ఉంచేలా కార్యాచరణ సిద్ధం చేయాలి. వచ్చే రెండేళ్లలో అన్ని ఆర్బీకేల్లోనూ డ్రోన్స్‌ ఉండేలా చూడాలి. కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల ద్వారా ఇచ్చిన వ్యవసాయ యంత్ర సామగ్రి అంతా రైతులందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి’’ అని అధికారులకు సీఎం ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని