AP News: జిల్లా కేంద్రాల్లో హెల్త్‌ హబ్‌లు: సీఎం

వైద్యం కోసం ప్రజలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వెళ్తున్నారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. పక్క రాష్ట్రాలకు వైద్యం కోసం ఎందుకు వెళ్తున్నారో

Published : 28 May 2021 19:16 IST

కరోనా కట్టడిపై సమీక్ష

 

అమరావతి: వైద్యం కోసం ప్రజలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వెళ్తున్నారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. పక్క రాష్ట్రాలకు వైద్యం కోసం ఎందుకు వెళ్తున్నారో ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారు. శుక్రవారం ఆయన కరోనా కట్టడి చర్యలు, రాష్ట్రంలో వైద్య సదుపాయాల అంశంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. ‘‘జిల్లా ప్రధాన కేంద్రాల్లో హెల్త్‌ హబ్‌లను ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో కనీసం 16చోట్ల హెల్త్‌ హబ్‌లు ఏర్పాటు చేయాలి. ఒక్కోచోట కనీసం 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలి. ఒక్కో ఆస్పత్రికి ఐదెకరాల చొప్పున కేటాయించాలి.  

మూడేళ్లలో కనీసం రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు భూములు కేటాయించాలి. దీనివల్ల కనీసం 80 మల్టీ, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయి. ప్రభుత్వం తరఫున మరో 16 వైద్య, నర్సింగ్‌ కళాశాలలు వస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ప్రైవేటు రంగంలో మంచి ఆస్పత్రులు వస్తాయి. ప్రతి జిల్లా కేంద్రంలో, కార్పొరేషన్లలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయి.  దీంతో ఇతర ప్రాంతాలకు వైద్యానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు మంచి ప్రమాణాలతో వైద్యం అందుతుంది. నెలరోజుల్లో ఈ పాలసీని తీసుకురావాలి’’ అని సీఎం ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని