
గనుల శాఖపై జగన్ సమీక్ష.. కీలక నిర్ణయాలు
అమరావతి: రాష్ట్రంలో గ్రానైట్‌పై సీనరేజి రుసుము వసూలు బాధ్యత ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. ఈ సీనరేజీని గ్రానైట్ సైజు విధానంలో కాకుండా బరువు ఆధారంగా నిర్ణయించాలని ఆదేశించారు. ఈ విధానంతో కనీసం 35 నుంచి 40శాతం ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు. ఇదే సమయంలో మైనర్ ఖనిజాలను ఈ-ఆక్షన్ ద్వారానే విక్రయించాలని నిర్ణయించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి ఈ శాఖలో సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించారు. లీజులు తీసుకొని గనులు నిర్వహించని చోట కొత్తగా ఈ-వేలం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియతో ప్రభుత్వానికి మరో రూ.1000 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. సెప్టెంబర్ నుంచి కొత్త నిర్ణయాలు అమలులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. మైనింగ్ శాఖలో నిఘా, అమలు విభాగం పటిష్టంగా ఉండాలని, ఆదాయాలకు గండి పడకుండా చూడాలని సీఎం సూచించారు. వర్షాకాలం వచ్చే లోపు 60 నుంచి 79 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.