CM Jagan: విభజన హామీలు నెరవేర్చే బాధ్యత కేంద్రానిదే: సీఎం జగన్‌

విభజన కారణంగా ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు.

Published : 20 Nov 2023 19:01 IST

అమరావతి: కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర విభజన అంశాలపై మంగళవారం కీలక సమావేశం జరగనుంది. విభజన హామీలు, 13వ షెడ్యూల్‌లోని సంస్థల అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశం దృష్ట్యా ఏపీ సీఎస్‌ సహా ఇతర అధికారులతో ఇవాళ సీఎం జగన్‌ సమీక్ష చేశారు.

‘‘విభజన కారణంగా ఏపీకి తీవ్ర నష్టం జరిగింది. విభజన జరిగి పదేళ్లు పూర్తయినా చట్టంలోని అంశాలు పరిష్కరించలేదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ప్రత్యేక హోదా, పోలవరం నిధుల హామీ ఇంకా నెరవేరలేదు. తెలంగాణ నుంచి ఏపీకి విద్యుత్‌ బకాయిలు ఇంకా రాలేదు’’ అని జగన్‌ అన్నారు. రైల్వే జోన్‌, విశాఖ మెట్రోపై సమావేశంలో చర్చించాలని అధికారులకు జగన్‌ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని