CM Jagan: పోలీసులకు కచ్చితంగా ‘వీక్లీ ఆఫ్’ నా కోరిక.. కానీ..: సీఎం జగన్‌

రాష్ట్రంలో పోలీసుల పనితీరు బాగా మెరుగుపడిందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. మహిళలపై నేరాల విచారణకు సమయం కూడా చాలా తగ్గిందని చెప్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు.

Updated : 21 Oct 2022 12:35 IST

విజయవాడ: రాష్ట్రంలో పోలీసుల పనితీరు బాగా మెరుగుపడిందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. మహిళలపై నేరాల విచారణకు సమయం కూడా చాలా తగ్గిందని చెప్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన అంనతరం ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు.

పోలీసులకు పనిభారం తగ్గించేందుకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నామని జగన్‌ తెలిపారు. 6,511 ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చినట్లు ఆయన వివరించారు. తమ ప్రభుత్వం వచ్చాక సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ఇంటింటికీ అందిస్తున్నామన్నారు. పోలీసు వ్యవస్థలోనూ చాలా మార్పులు వచ్చాయని చెప్పారు. పోలీసులకు కచ్చితంగా వీక్లీ ఆఫ్‌ ఇవ్వాలనేది తన కోరికని.. సిబ్బంది కొరతతో దాన్ని పూర్తిగా అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో తీవ్రవాదం తగ్గుముఖం పట్టిందని సీఎం చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని