Andhra news: పద్మవ్యూహాన్ని తలపించిన సీఎం తిరుపతి సభ..

తిరుపతిలో నిర్వహించిన జగనన్న విద్యాదీవెన బహిరంగ సభ పద్మవ్యూహాన్ని తలపించింది. ముఖ్యమంత్రి పాల్గొన్న ఈ సభకు భారీగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తరలించారు. అలాగే మహిళా సంఘాల సభ్యులను తీసుకొచ్చారు. సభ పూర్తయ్యే వరకూ ఎవరూ బయటికి వెళ్లకుండా పోలీసులు, మెప్మా అధికారులు మైదానం గేట్లన్నీ మూసివేశారు.

Published : 05 May 2022 19:28 IST

తిరుపతి: తిరుపతిలో నిర్వహించిన జగనన్న విద్యాదీవెన బహిరంగ సభ పద్మవ్యూహాన్ని తలపించింది. ముఖ్యమంత్రి పాల్గొన్న ఈ సభకు భారీగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తరలించారు. అలాగే మహిళా సంఘాల సభ్యులను తీసుకొచ్చారు. సభ పూర్తయ్యే వరకూ ఎవరూ బయటికి వెళ్లకుండా పోలీసులు, మెప్మా అధికారులు మైదానం గేట్లన్నీ మూసివేశారు. అయితే 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్న వేళ సభా ప్రాంగణంలో తీవ్రమైన ఉక్కపోతను విద్యార్థులు, తల్లిదండ్రులు, మహిళా సంఘాల సభ్యులు భరించలేకపోయారు. ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్నామని, నీరసం వస్తున్నందున బయటికి పంపాలని ప్రాథేయపడినా పోలీసులు లెక్కచేయలేదు. వారిని బెదిరించి గేట్ల వద్దే నిలువరించారు. ఓపిక నశించిన మహిళా సంఘాల సభ్యులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. గేట్లు తోసుకుని బయటికి వెళ్ళిపోయారు. విద్యార్థులైతే పది అడుగుల ప్రహరీ దూకేశారు. అలా వెళ్లలేకపోయిన కొందరు మహిళలు నీరసంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ పరిస్థితుల్లో చేసేదేమీ లేక ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలోనే అధికారులు గేట్లు తెరిచారు. అప్పటిదాకా ఉక్కపోతతో అల్లాడిపోయిన మహిళలు గేట్లు తీశాక అక్కడి నుంచి బయటపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని