CM Jagan: సీఎం జగన్‌ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ (CM Jagan)  ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. టేకాప్‌ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్‌  చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Updated : 30 Jan 2023 19:04 IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM Jagan) దిల్లీ (Delhi) వెళ్లే విమానం సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే గన్నవరం విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5.03 గంటలకు బయలు దేరిన విమానం.. 5.26 గంటలకు అత్యవసరంగా ల్యాండ్‌ అయినట్లు సమాచారం. విమానం ఏసీ వాల్వ్‌లో లీకేజీ వల్ల సమస్య ఏర్పడినట్లు సీఎంవో అధికారులు తెలిపారు. సమస్యను గుర్తించిన పైలట్‌ విమానాన్ని వెనక్కి మళ్లించారని చెప్పారు.

మరోవైపు  ఇవాళ రాత్రికే సీఎం దిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎంవో అదేశించింది.  అవసరమైతే మరో విమానంలో దిల్లీ వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  సీఎం వెంట సీఎస్‌ జవహార్‌ రెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డి, అధికారులు పూనం మాలకొండయ్య, కృష్ణ మోహన్‌రెడ్డి, చిదానందరెడ్డి వెళ్లనున్నారు. రేపు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ దిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లో జగన్‌ పాల్గొనాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని