Lata Mangeshkar: ఉత్తర, దక్షిణ భారత సంగీత సరిగమల వారధి లతాజీ: సీఎం కేసీఆర్

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్దాలపాటు

Updated : 06 Feb 2022 13:14 IST

హైదరాబాద్‌: ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్దాలపాటు తమ పాటలతో సినీ సంగీత రంగంపై లతాజీ చెరగని ముద్రవేశారని.. ఆమె మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని చెప్పారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ట్వీట్‌ చేసింది.

‘‘లతాజీ ఉత్తర, దక్షిణ భారత సంగీత సరిగమల వారధి. హిందుస్థానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్‌ అమంత్‌ అలీఖాన్‌ వద్ద నేర్చుకున్న ఆమె.. ఉర్దూ కవుల సాహిత్యాన్ని అధ్యయనం చేసి గజల్‌ గమకాలను శ్రావ్యంగా ఒలికించేది. కొందరికి పురస్కారాల వల్ల గౌరవం వస్తే.. దేశ విదేశాల్లో అందిన లెక్కలేనన్ని పురస్కారాలకు లతాజీ వల్ల గౌరవం దక్కింది. ఎందరో గాయకులు రావొచ్చు కానీ లతాజీ లేని లోటు పూరించలేనిది. ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుకొంటున్నా’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని