సీఎం కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నీ విజేత ఎంసీసీ‌

సిద్దిపేట క్రీడా మైదానంలో సీఎం కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ ఉత్సాహంగా సాగుతోంది. గత పది రోజులుగా రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఈ మ్యాచ్‌లను

Updated : 24 Sep 2022 17:18 IST

సిద్దిపేట టౌన్‌ : సిద్దిపేట క్రీడా మైదానంలో సీఎం కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ ఉత్సాహంగా సాగింది. గత పది రోజులుగా రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆధ్వర్యంలో టోర్నీ నిర్వహించారు. మొత్తం 60 జట్లు తలపడగా ఎంసీసీ యూత్‌, ఇండియన్‌ టీం-05 జట్లు ఫైనల్‌కు చేరాయి. దీంతో ఈ జట్లకు బుధవారం డే అండ్‌ నైట్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడ్డాయి. తొలుత టాస్‌ గెలిచిన ఇండియన్‌ టీం ఫీల్డింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఏసీసీ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. అనంతరం 101 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇండియన్‌ టీం-5 జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులే చేయగలిగింది. దీంతో 33 పరుగుల తేడాతో ఎంసీసీ యూత్‌ జట్టు విజయం సాధించి ట్రోఫీ గెలుచుకుంది. 

అజహర్‌ బౌలింగ్‌.. హరీశ్‌ బ్యాటింగ్‌

మరోవైపు ఈ మ్యాచ్‌‌ తిలకించేందుకు టీమిండియా మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ సిద్దిపేట వచ్చారు. ఇన్నింగ్స్‌ విరామం సమయంలో మంత్రి హరీశ్‌, అజహర్‌ కాసేపు క్రికెట్‌ ఆడారు. అజహర్‌ బౌలింగ్‌ చేయగా.. హరీశ్‌ బ్యాటింగ్‌తో అలరించారు. పెద్ద సంఖ్యలో క్రికెట్‌ అభిమానులు తరలిరావడంతో సిద్దిపేట క్రీడామైదానంలో సందడి నెలకొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు