CM KCR: ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భం: సీఎం కేసీఆర్
దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. తొమ్మిదేళ్లు నిలదొక్కుకున్న తీరు అద్భుతమని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆరు దశాబ్దాల పాటు వివిధ దశల్లో సాగిన పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలను రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. ప్రజలను మమేకం చేస్తూ మలిదశ ఉద్యమాన్ని పార్లమెంటరీ పంథాలో ప్రజాస్వామ్య పోరాటం దిశగా మలిపిన తీరును గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధన పోరాట క్రమంలో తాను ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, అధిగమించిన అడ్డంకులను గుర్తుకు తెచ్చుకున్నారు. శాంతియుత పద్దతిలో పోరాటాన్ని కొనసాగించి రాష్ట్రాన్ని సాధించిన మొత్తం ప్రక్రియను, దీనికి సహకరించిన వారందర్నీ కేసీఆర్ తలచుకున్నారు.
భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. తొమ్మిదేళ్లు నిలదొక్కుకున్న తీరు అద్భుతమని సీఎం కేసీఆర్ అన్నారు. నాడు వెనకబాటుకు గురైన తెలంగాణ నేడు అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకుపోతోందని తెలిపారు. ‘తెలంగాణ మోడల్’ పాలన దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్న సీఎం.. తెలంగాణ వంటి పాలన కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు. దేశ ప్రజలందరి ఆదరాభిమానాలు చూరగొనడం రాష్ట్ర ప్రజలు సాధించిన ఘన విజయమని పేర్కొన్నారు. ఇది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భమన్నారు. అన్ని రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధిస్తూ మహోజ్వల స్థితికి చేరుకుంటున్న రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని 3 వారాల పాటు అంగరంగ వైభవంగా, పండుగ వాతావారణంలో జరిపేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలను ఆస్వాదిస్తున్న ఈ ఆనందకర సమయంలో సంతోషాలను పంచుకుంటూ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగస్వాములై సంబురాలను ఘనంగా జరుపుకోవాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ekyc: గల్ఫ్ వలసదారుల్లో ఈకేవైసీ గుబులు
-
Asifabad: బడికెళ్లాలంటే.. ఈత రావాలి
-
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాంపోజిట్ తెలుగు కొనసాగింపు
-
ఆ ఇంటికి దీపం ‘స్వర్ణభారత్’.. దత్తత తీసుకున్న అమ్మాయికి వివాహం జరిపించిన మాజీ ఉపరాష్ట్రపతి కుమార్తె
-
Rain Alert: నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
-
CM Jagan: కరకట్ట రోడ్డు కనిపిస్తోందా సారూ..!