Batukamma: రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు: కేసీఆర్‌

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

Published : 24 Sep 2022 20:54 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. తీరొక్క పువ్వుతో బతుకమ్మను పేర్చి... ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే బతుకమ్మ వేడుకలు పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని తెలిపారు. ప్రకృతిని ఆరాధిస్తూ, తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక శోభ వెల్లివిరుస్తుందని చెప్పారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం... తెలంగాణ సంస్కృతి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్దపీట వేసిందని అన్నారు.

దాదాపు రూ.350 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి మంది ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన చీరలను వారికి బతుకమ్మ కానుకగా అందిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల జీవనంలో భాగమైన ‘బతుకమ్మ’ ఖండాంతరాలకు విస్తరించి తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. బతుకమ్మ పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించాలని సీఎం ఆకాంక్షించారు.

పువ్వులను పూజించే గొప్ప పండుగ: సత్యవతి రాథోడ్‌

రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్‌ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పువ్వులను పూజించే గొప్ప వేడుక బతుకమ్మ పండుగ అని ఆమె అన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అని ఆమె చెప్పారు.

ఆడబిడ్డలకు ఇష్టమైన పండగ: రేవంత్‌ రెడ్డి

తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిదర్శనమన్నారు. ఆడబిడ్డలకు ఇది ఎంతో ఇష్టమైన పండగ అని, తెలంగాణ  సంస్కృతికి అద్దంపట్టేలా తీరొక్క పువ్వుతో జరిగే ఈ సంబురాలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts