CM KCR: యాదాద్రి శివాలయ ఉద్ఘాటనలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయం ఉద్ఘాటన మహాక్రతువును వైభవంగా నిర్వహించారు.

Updated : 25 Apr 2022 16:45 IST

యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయం ఉద్ఘాటన మహాక్రతువును వైభవంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ సతీసమేతంగా ఈ క్రతువులో పాల్గొన్నారు. రామలింగేశ్వర స్వామి ఆలయ ఉద్ఘాటనకు ఐదు రోజులుగా ఆగమశాస్త్ర రీత్యా మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించిన విషయం తెలిసిందే. స్వర్ణ కలశాల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఉద్ఘాటన పర్వాలు పూర్తైన నేపథ్యంలో పార్వతీ పరమేశ్వరుల నిజరూపాల దర్శనాలకు అవకాశం కల్పించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని