CM KCR: విప్రహిత బ్రాహ్మణ సదన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
పురవాసుల హితం కోరేవారే పురోహితులు అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బ్రాహ్మణుల్లోనూ చాలామంది పేదలున్నారన్న ఆయన.. బ్రాహ్మణ పరిషత్‌కు ఏటా ₹100కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్: పురవాసుల హితం కోరేవారే పురోహితులు అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బ్రాహ్మణుల్లోనూ చాలామంది పేదలున్నారని చెప్పారు. బ్రాహ్మణ పరిషత్‌కు ఏటా రూ.100కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదన్‌ను (Brahmana Samkshema Sadan) సీఎం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేసీఆర్(KCR) మాట్లాడుతూ.. ‘‘విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని రూ.12కోట్లతో నిర్మించాం. బ్రాహ్మణ సదన్‌ను నిర్మించడం దేశంలో ఇదే మొదటిసారి. వేదశాస్త్ర విజ్ఞాన భాండాగారంగా బ్రాహ్మణ సదన్ విలసిల్లాలి. బ్రాహ్మణుల సంక్షేమానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలోని మరో 2,696 దేవాలయాలకు ధూప, దీప, నైవేద్యాల పథకాన్ని వర్తింపజేస్తాం. ఈ పథకం కింద నెలకు ఇచ్చే నిధులను రూ.10వేలకు పెంచాం. వేదపండితులకు ఇచ్చే గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5వేలకు పెంచాం. అర్హత వయసు 75 నుంచి 65 ఏళ్లకు తగ్గించాం’’ అని కేసీఆర్ తెలిపారు.
బ్రాహ్మణ సంక్షేమ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీఎస్ శాంతికుమారి, ఎంపీ రంజిత్‌రెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, రాజీవ్‌శర్మ, కేవీ రమణాచారితో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన పీఠాధిపతులు, పండితులు పాల్గొన్నారు.
బ్రాహ్మణ సదన్ నిర్మాణానికి ప్రభుత్వం గోపన్‌పల్లి గ్రామంలో 6 ఎకరాల 10 గుంటల స్థలాన్ని కేటాయించింది. ఇందులో బ్రాహ్మణ సమాజ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 12 నిర్మాణాలను చేపట్టారు. 2017 జూన్ 5న పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మూడంతస్థుల్లో ఉన్న ఈ భవనంలో కల్యాణ మండపం, సమాచార కేంద్రం, పీఠాధిపతుల, ధర్మాచార్యుల సదనం ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Motkupalli Narasimhulu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత : మోత్కుపల్లి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని