Telangana news: చాకలి ఐలమ్మ పౌరుషం...తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్‌

తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. సోమవారం ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్..

Updated : 24 Nov 2022 16:13 IST

హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. సోమవారం ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్.. సాయుధ పోరాటంలో ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా ఆమె సేవలను సీఎం స్మరించుకున్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తెగువ ప్రదర్శించిన చాకలి ఐలమ్మ తెగువ, పౌరుషం తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వముందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శమన్నారు. హక్కులకోసం ఆమె చేసిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తి సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని