CM KCR: గాంధీ స్ఫూర్తితో శాంతి మార్గంలో తెలంగాణ సాధించుకున్నాం: సీఎం కేసీఆర్‌

స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా అహింసా, సత్యాగ్రహమనే సిద్ధాంతాలను ఆచరించి ప్రపంచానికి సరికొత్త పోరుబాటను గాంధీజీ పరిచయం చేశారని కేసీఆర్‌ అన్నారు. గాంధీ బాటలో పయనించిన దేశాలెన్నో బానిసత్వం నుంచి విముక్తి పొందాయని తెలిపారు.

Published : 01 Oct 2022 21:57 IST

హైదరాబాద్‌: ప్రజాస్వామిక పంథా ద్వారా దేశ ప్రజలను స్వాంత్య్రోద్యమంలో లక్ష్యసాధన దిశగా కార్యోన్ముఖుల్ని చేసిన జాతిపిత మహాత్మా గాంధీ జీవితం అందరికీ ఆదర్శనీయమని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించిన సీఎం.. మహాత్ముడు జాతికి అందించిన స్ఫూర్తిని స్మరించుకున్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా అహింసా, సత్యాగ్రహమనే సిద్ధాంతాలను ఆచరించి ప్రపంచానికి సరికొత్త పోరుబాటను గాంధీజీ పరిచయం చేశారని  అన్నారు. గాంధీజీ బాటలో పయనించిన దేశాలెన్నో బానిసత్వం నుంచి విముక్తి పొందాయని తెలిపారు. భారతదేశాన్ని గాంధీ పుట్టిన దేశంగా చెప్పుకునే స్థాయి కలిగిన మహా పురుషుడు జాతిపిత అని కొనియాడారు. గాంధీజీ స్ఫూర్తితో శాంతియుత మార్గంలో ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయాన్ని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. సత్యమేవ జయతే.. అని చాటి చెప్పిన మహాత్ముడి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. గుంపులో ఒకరిగా ఉండటం తేలికే కానీ ఒంటరిగా నిలబడటానికి ధైర్యం కావాలన్న గాంధీ మాటలే ప్రేరణగా హక్కుల సాధన కోసం తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts