CM Kcr: ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరేయాలి: సీఎం కేసీఆర్‌

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్రంలో 15రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని..

Published : 23 Jul 2022 22:20 IST

హైదరాబాద్‌: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్రంలో 15రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఆగస్టు 15కు వారం రోజుల ముందు, వారం రోజుల తర్వాత కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. మహనీయుల త్యాగాలు, పోరాటాలు చాటేలా.. దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం పేరిట రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకం ఎగరవేయాలన్న సీఎం.. ఇందుకోసం 1.20కోట్ల పతాకాలను చేనేత పవర్‌ లూం కార్మికులతో తయారు చేయించాలని చెప్పారు. అన్ని విద్యాసంస్థల్లోనూ కార్యక్రమాలు, వివిధ రకాల పోటీలు నిర్వహించాలని తెలిపారు. పల్లె నుంచి పట్నం దాకా స్వాతంత్ర్య వజ్రోత్సవ దీప్తిని వెలిగించేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని