CM Kcr: పాలమూరులో అద్భుతాలు జరుగుతున్నాయి: సీఎం కేసీఆర్‌

నాగర్‌ కర్నూల్‌లో నూతనంగా నిర్మించిన భారాస జిల్లా కార్యాలయాన్ని, కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంబించారు.

Updated : 06 Jun 2023 18:48 IST

నాగర్‌ కర్నూల్‌: రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. నాగర్‌ కర్నూల్‌లో నూతనంగా నిర్మించిన భారాస జిల్లా కార్యాలయాన్ని, కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.

‘‘రాష్ట్రంలో ఐటీ పురోగతిపై ఇటీవల నాస్‌కామ్‌ నివేదిక ఇచ్చింది. భారత దేశంలో ఐటీ సెక్టార్‌లో 50శాతం ఉద్యోగాలు తెలంగాణలోనే లభిస్తున్నాయి. కల్వకుర్తిలో లక్ష ఎకరాలకు నీరు వస్తోంది. నాగర్‌ కర్నూలులో  ఘనంగా 19వ కలెక్టరేట్‌ను ప్రారంభించుకున్నాం.. త్వరలో గద్వాల, మంచిర్యాల కలెక్టరేట్లు పూర్తవుతాయి. గతంలో వలసలు, కరవుకు నిలయంగా పాలమూరు ఉండేది. ప్రస్తుతం పాలమూరులో అద్భుతాలు జరుగుతున్నాయి. త్వరలో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తాం. పెద్ద రాష్ట్రాల తలసరి ఆదాయం తెలంగాణ కంటే తక్కువ. సంక్షేమ, అభివృద్ధి పథకాల రూపకల్పన హైదరాబాద్‌లో జరిగినా.. క్షేత్రస్థాయిలో అమలు చేసిన ఉద్యోగులకే ఆ ఘనత దక్కుతుంది’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని