CM Kcr: గల్వాన్‌లో అమరులైన సైనికుల కుటుంబాలను పరామర్శించనున్న సీఎం కేసీఆర్‌

గల్వాన్‌ అమరులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2020 జూన్‌ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మన దేశానికి చెందిన 20 మంది సైనికులు ..

Published : 04 Mar 2022 01:17 IST

దిల్లీ: గల్వాన్‌ అమరులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2020 జూన్‌ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మన దేశానికి చెందిన 20 మంది సైనికులు వీరోచితంగా పోరాడి మృతి చెందారు. రాష్ట్రానికి చెందిన కల్నల్‌సంతోష్‌ బాబు సహా మరో 19మంది వీరమరణం పొందారు.  సంతోష్‌బాబుతో పాటు అమరులందరికీ  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిహారం ప్రకటించారు.

2020 జూన్ 19న ప్రధానమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ పరిహారం ప్రకటించారు. సంతోష్ బాబుకు రూ.5కోట్లు, మిగతా 19 మంది సైనికుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని ప్రకటించారు. గతంలోనే సూర్యాపేటలోని సంతోష్ బాబు ఇంటికి వెళ్లిన సీఎం కేసీఆర్... పరిహారంతో పాటు భార్య సంతోషికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. 19 మంది అమరుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది. సైనికుల కుటుంబ సభ్యులకు ఆ పరిహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సీఎం కేసీఆర్ నేరుగా వెళ్లి ఆ కుటుంబాలకు పరిహారం అందించనున్నారు. మరణించిన వారిలో బిహార్‌కు చెందిన వారు ఐదుగురు, పంజాబ్ నుంచి నలుగురు, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ్‌బంగా నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. శుక్రవారం రాంచీకి వెళ్లి సైనికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థికసాయం అందించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని