CM KCR: 23న ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
అకాల వర్షం, వడగళ్ల వాన కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీర్ గురువారం ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు.
హైదరాబాద్: అకాల వర్షం, వడగళ్ల వాన కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీర్ గురువారం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలో సీఎం పర్యటన కొనసాగనుంది. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి ఖమ్మం జిల్లా బోనకల్లులో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. అనంతరం వరంగల్ జిల్లాలో పరిశీలన తర్వాత కరీంనగర్ జిల్లా చేరుకుంటారు. రామడుగు మండలంలో దెబ్బతిన్న పంటలను సీఎం పరిశీలిస్తారు. ఆయా ప్రాంతాల్లోని అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి పంట నష్టం వివరాలు తెలుసుకుంటారు. సీఎం పర్యటన దృష్ట్యా ప్రత్యేకంగా హెలిప్యాడ్ తో పాటు రైతు వేదికలో సమావేశం నిర్వహించే ప్రాంతాలను కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు. ఈమేరకు ఆయా జిల్లాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
TDP Mahanadu: భారీ వాహనాలను అనుమతించి..అవస్థలు పెంచారు!
-
Crime News
Cyber Crime: ఉచిత థాలీ ఎరలో దిల్లీ మహిళ
-
Ap-top-news News
Heat Waves: నేడు, రేపు వడగాడ్పులు!
-
India News
PM Modi: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
-
Crime News
పెళ్లింట మహావిషాదం.. ముగ్గురు తోబుట్టువుల సజీవదహనం
-
Ap-top-news News
YSRCP: పాతపట్నం ఎమ్మెల్యేకు గిరిజనుల నిరసన సెగ