TS News: ప్రజలు స్వీయనియంత్రణ చర్యలు చేపట్టాలి: సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యారోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని

Updated : 09 Jan 2022 18:54 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యారోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్వీయ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు.  ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ‘‘ప్రజలు మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. ప్రతి ఒక్కరూ విధిగా కరోనా టీకాలు తీసుకోవాలి. 15-18 ఏళ్ల పిల్లలకు తల్లిదండ్రులు కరోనా టీకా వేయించాలి. రేపటి నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు బూస్టర్‌ డోస్‌. కరోనా లక్షణాలున్నవారు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. సంక్రాంతి పండుగను ఎవరి ఇళ్లలో వారు జరుపుకోవాలి. కరోనాను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నాం’’ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

అనంతరం సచివాలయ నిర్మాణ పనుల పురోగతిపై సీఎం సమీక్షించారు. సచివాలయ పనులు వేగంగా, సమాంతరంగా జరగాలని ఆదేశించారు. ల్యాండ్‌ స్కేపింగ్‌, రక్షణ వ్యవస్థ పనుల్లో వేగం పెంచాలని, అనుబంధ భవనాల నిర్మాణ పనులు వేగవంతం కావాలని సూచించారు. సచివాలయంలో పోలీసులకు వసతులపై చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ భవనాన్ని వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని