అలాచేసిన వారు విజయ తీరాలకు చేరతారు: సీఎం రేవంత్‌

టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులకు సీఎం అభినందనలు తెలిపారు.

Published : 07 Jul 2024 17:25 IST

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్ష (TGPSC Group 1 Prelims)లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ (TGPSC Group 1 Mains)కు  అర్హత సాధించిన 31,382 మందికి ఆల్‌ది బెస్ట్‌ చెప్పారు. అక్టోబర్‌ 21 నుంచి 27 మధ్య జరిగే మెయిన్స్ పరీక్షలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ‘ఎక్స్‌’ వేదికగా ఆయన పోస్టు పెట్టారు. ప్రిలిమినరీ పరీక్షలో విజయం సాధించలేకపోయిన అభ్యర్థులు నిరుత్సాహపడొద్దని విజ్ఞప్తి చేశారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దాని కోసం ప్రయత్నించడం.. విజయం సాధించే వరకు ప్రయత్నాన్ని విరమించకపోవడం ఒక వ్యాపకంగా పెట్టుకున్నవారు ఎప్పటికైనా విజయతీరాలకు చేరతారని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.

టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలను ఆదివారం ఉదయం టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. తుది కీతో పాటు రిజల్ట్స్‌ను టీజీపీఎస్సీ ఒకేసారి విడుదల చేసింది. గ్రూప్‌-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని