స్మార్ట్‌ మీటర్లపై అపోహలొద్దు: సీఎండీ శ్రీకాంత్‌

ఉచిత విద్యుత్‌ నగదు బదిలీపై రైతులకు ఎలాంటి అపోహలు వద్దని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ తెలిపారు.

Published : 08 Sep 2020 00:58 IST

అమరావతి: ఉచిత విద్యుత్‌ నగదు బదిలీపై రైతులకు ఎలాంటి అపోహలు వద్దని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ తెలిపారు. మీటర్లకు సంబంధించి రైతులపై ఎలాంటి భారం పడదని ఆయన వెల్లడించారు. మీటర్లలో ఏ సమస్యలు తలెత్తినా విద్యుత్ సంస్థలే మీటర్లను ఉచితంగా ఏర్పాటు చేస్తాయని తెలిపారు. మీటర్లు అపహరణకు గురైతే రైతు సంబంధిత డిస్ర్టిబ్యూషన్‌ కంపెనీల అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. దీనిపై సంబంధిత డిస్కంల అధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు రైతు నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయరని శ్రీకాంత్‌ తెలిపారు. 
రీడింగ్ రికార్డింగ్‌కు సంబంధించి డిస్ర్టిబ్యూషన్‌ కంపెనీలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. సిబ్బందితో పాటు స్పాట్‌ బిల్లింగ్‌ ఏజెన్సీల ద్వారా రికార్డింగ్‌లు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. స్మార్ట్‌ మీటర్లను సాధ్యమైనంతవరకు బిగించాలని ప్రతిపాదించామని, దీనికి సంబంధించి ఎలాంటి సమస్య తలెత్తదని సీఎండీ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు