కాలేజీ, యూనివర్సిటీలు క్యాంపస్‌లను తెరవొచ్చు: యూజీసీ

దేశంలోని అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు ప్రత్యక్ష తరగతులను తిరిగి ప్రారంభించుకోవచ్చని విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ) వెల్లడించింది. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు, పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ

Updated : 12 Feb 2022 04:28 IST

దిల్లీ: దేశంలోని అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు ప్రత్యక్ష తరగతులను తిరిగి ప్రారంభించుకోవచ్చని విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) వెల్లడించింది. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు, పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ తరగతులను కొనసాగించవచ్చని పేర్కొంది. 

‘‘రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కళాశాలలు, యూనివర్సిటీలు క్యాంపస్‌లను తెరవొచ్చు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ లేదా రెండు రకాలుగా తరగతులు, పరీక్షలు నిర్వహించుకోవచ్చు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన కొవిడ్‌ నిబంధనలను పాటించడం తప్పనిసరి’’ అని యూజీసీ తెలిపింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభానికి మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతున్న ఆన్‌లైన్‌ తరగతుల నుంచి తిరిగి పాత విధానంలోకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మారేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను సవరిస్తూ వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని