Colon Cancer: పెద్దపేగుకు క్యాన్సర్‌ వస్తే..! ఏం చేయాలంటే..?

పేరుకు పెద్ద పేగయినా జీర్ణవ్యవస్థలో ఎక్కడో అడుగున ఉంటుంది. అయినా దాని ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. నీళ్ల విరేచనాల నుంచి మొదలు క్యాన్సర్ల దాకా సమస్యలు అక్కడే కనిపిస్తాయి.

Published : 17 Oct 2022 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పేరుకు పెద్ద పేగయినా జీర్ణవ్యవస్థలో ఎక్కడో అడుగున ఉంటుంది. అయినా దాని ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. నీళ్ల విరేచనాల నుంచి మొదలు క్యాన్సర్ల దాకా సమస్యలు అక్కడే కనిపిస్తాయి. ఇక్కడ వచ్చే సమస్యలను, క్యాన్సర్‌ ఆనవాళ్లను తెలుసుకునే వీలుందా..? ఉంటే ఏం చేయాలో సర్జికల్‌ ఆంకాలజిస్టు డాక్టర్‌ శ్రీరామ్‌ బూరుగుపల్లి వివరించారు. 

ఆహారంలో మార్పులతోనే..

గతంలో పెద్దపేగులో క్యాన్సర్‌ వచ్చేది కాదు..ఇటీవల కాలంలో ఆహారంలో మార్పులు, జంక్‌,మసాలా ఫుడ్‌ తీసుకోవడం అధికం కావడంతో క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. ఊబకాయం పెరగడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. మాంసాహారంతో పాటు మద్యం, పొగతాగడంతో క్యాన్సర్‌ వస్తుంది. మలబద్దకంతో కూడా సమస్య మొదలవుతుంది. బరువు తగ్గడం మంచిది కాదు. అది క్యాన్సర్‌ అవునా..? కాదా అని తెలుసుకోవడానికి కొలొన్‌ పరీక్ష చేయించుకుంటే తెలిసిపోతుంది. మలద్వారం ద్వారా రక్తం పడితే మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. కొత్త చికిత్స విధానంతో క్యాన్సర్‌ను తొందరగా నయం చేయడానికి వీలుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని