Viral: టీషర్ట్‌ మీద టీకా ధ్రువపత్రం.. ఎందుకంటే..!

దేశంలో లాక్‌ డౌన్‌ ఆంక్షలు ఎత్తివేయడంతో ప్రయాణాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Published : 10 Aug 2021 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో లాక్‌ డౌన్‌ ఆంక్షలు ఎత్తివేయడంతో ప్రయాణాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో విమానాశ్రయాల్లో, ప్రముఖ హొటళ్లలో కరోనా టీకా ధ్రువపత్రం ఉంటేనే అనుమతిస్తున్నారు. అయితే ఆయా చోట్లకు వెళ్లిన ప్రతిసారి ధ్రువపత్రాన్ని చూపించకుండా ఉండటానికి  హాస్యనటుడు అతుల్ ఖత్రి ఒక వినూత్న మార్గాన్ని కనిపెట్టారు. టీకా సర్టిఫికెట్‌ అందరికీ కనిపించేలా దాన్ని తన టీషర్ట్‌ మీద ముద్రించుకున్నారు. వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌తో ఉన్న తెల్లని టీషర్టును ధరించిన ఫోటోలను  తన ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకున్నారు. ఆ చిత్రాలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా అతుల్‌ ఖత్రి ఆలోచన అదిరిపోయిందంటూ నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.

కరోనావైరస్ మహమ్మారి వల్ల ఒత్తిడి గురి అవుతన్న ప్రజలకు హాస్యాన్నిపంచడానికి అతుల్‌ ఖత్రి గత సంవత్సరం ఓన్లీ పాజిటివ్ న్యూస్ అనే సిరీస్‌ను ప్రారంభించారు. ఆ సిరీస్‌ నెటిజన్లను ఎంతగానో అలరించింది. అలాగే అతని స్టాండ్‌-అప్‌ కామెడీ వీడియోలు కూడా నెటిజన్ల ఆదరణను చూరగొంటున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని