
Updated : 19 Jul 2021 21:58 IST
ఆ జీవోని తాత్కాలికంగా నిలిపేసిన ఏపీ సర్కార్
అమరావతి: రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులను ఆర్థికశాఖలో కలుపుతూ ఇచ్చిన జీవోను ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. తదుపరి జీవో వచ్చే వరకు నిలుపుదల చేస్తున్నట్టు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో రెవెన్యూ శాఖలో ఉన్న ఈ రెండు విభాగాలనూ ఆర్థికశాఖలో కలుపుతూ కొన్నాళ్ల క్రితం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రెండు శాఖలను ఆర్థిక శాఖలో కలుపుతూ తీసుకొచ్చిన జీవోను నిలుపుదల చేయడం గమనార్హం.
Tags :