Diabetes: మధుమేహులూ.. మీ కళ్లను జాగ్రత్తగా చూసుకోండి!

వయస్సు గడుస్తున్న కొద్దీ షుగర్‌ వ్యాధి కంటి రక్త కళాలను దెబ్బతీస్తుంది.  మధుమేహం గుర్తించిన తర్వాత ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా మందులను వాడాలి.

Published : 07 Mar 2022 01:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మధుమేహం సరైన మందులు, జాగ్రత్తలు పాటించకపోతే కళ్లను కబళిస్తుంది. బతుకును చీకటిమయం చేస్తుంది. వయస్సు గడుస్తున్న కొద్దీ షుగర్‌ వ్యాధి కంటి రక్త కళాలను దెబ్బతీస్తుంది.  మధుమేహం గుర్తించిన తర్వాత ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా మందులను వాడాలి. లేకపోతే రెటీనా సమస్యతో ఇబ్బంది పడాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం బారి నుంచి కళ్లను కాపాడుకోవడానికి ఏం చేయాలో కంటి వైద్యులు రవికుమార్‌ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. 

మధుమేహంతో వచ్చే సమస్యలెన్నో..

రక్తంలో గ్లూకోజ్‌ శాతం అధికంగా ఉండటంతో కన్ను, కిడ్నీ, కాలు, ఇతర నరాల్లోని టిష్యూలను ప్రభావితం చేస్తుంది. వీటిలో ఉండే చిన్న రక్తనాళాలను కేశ రక్తనాళాలు అంటారు. ఎండోథియర్‌ పొర లేచిపోవడంతో రక్తనాళాలు ఉబ్బిపోతాయి. ఎక్కువ షుగర్‌ ఉండటంతో ప్రతీ అవయవంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కంటిలోని రెటీనా దెబ్బతింటుంది. కాటరాక్టుతోపాటు కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. గ్లకోమా వయస్సుతో పాటు వచ్చినా మధుమేహంతో మరింత పెరుగుతుంది.

రెటినోపతి ఎలా: మధుమేహుల్లో సాధారణంగా వచ్చేది రెటినోపతి.  కంటిలో రెటీనాకు చిన్న చిన్న రక్తనాళాలుంటాయి. ఇవి ఉబ్బిపోవడం, కొన్నిసార్లు పగిలిపోతాయి కూడా.. దీంతో కంటి నుంచి నీరులాగా వస్తుంది. దీన్ని ఎడిమా అంటాం. క్రమంగా కంటిచూపు తగ్గిపోతుంది. కొంతమందికి కొత్త రక్తనాళాలు పుట్టుకొస్తాయి. ఈ పరిస్థితి వస్తే రక్తస్రావం జరుగుతుంది. చికిత్స చేయకపోవడంతో కంటి చూపు కోల్పోవచ్చు. రక్తం గడ్డ కట్టి కంటి రెటీనా ఊడిపోతుంది. 

కంటి సమస్యల్లో ఏదీ ప్రమాదకరం

రెటీనాకు రక్త సరఫరా తగ్గిపోతే సీరియస్‌గా తీసుకోవాలి. ఇస్కిమిక్‌ రెటీనా అంటాం.  ఆప్టిక్‌నర్వ్‌కు రక్త సరఫరా ఆగిపోతుంది.  దీంతో సెంట్రల్‌ రెటీనా నిలిచిపోతుంది. రెటీనా ఊడిపోతే ఎంత అతికించినా పాత చూపును తీసుకొని రాలేం. 

డయాబెటిక్‌ రెటినోపతి, కాటరాక్ట్‌, గ్లకోమాలకు చికిత్స ఎలా..?

రెటినోపతి నివారణకు షుగర్‌ను పూర్తిగా నియంత్రించుకోవాలి. అధిక రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్‌, కొలస్ట్రాల్‌ నియంత్రణలో ఉంచాలి.  పొగతాగడం ఆపేయాలి.  ఇలాయితే రెటినోపతిని రాకుండా చూడొచ్చు. కంటిలోపల రెటీనా ఉబ్బినపుడు కంటికి ఇంజక్షన్లు వేయవచ్చు.  లేజర్‌ చికిత్స కూడా అందుబాటులో ఉంది. కొత్త రక్త నాణాలు వచ్చినపుడు రెటీనా మొత్తం లేజర్‌ చికిత్స చేయాల్సి వస్తుంది. పొరపాటున రక్తస్రావం అయితే కూడా శస్త్రచికిత్సతో నయం చేయడానికి వీలుంది. 

మధుమేహులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

అసలే రెటినోపతి రాకూడదనుకుంటే మందులు, వ్యాయామంతో నివారించవచ్చు. కంటి డాక్టరు సలహాలు తీసుకోవాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని