Sajjala Ramakrishna Reddy: సజ్జల రామకృష్ణారెడ్డిపై సీఐడీకి ఫిర్యాదు

వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరులపై సీఐడీకి ఫిర్యాదు అందింది.

Updated : 25 Jun 2024 18:29 IST

నెల్లూరు: వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరులపై సీఐడీకి ఫిర్యాదు అందింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన గనుల యజమాని బద్రీనాథ్‌ సీఐడీ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో గనులు దోచేశారని ఆరోపించారు. 

‘‘సజ్జల అనుచరులు శ్రీకాంత్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి దౌర్జన్యం చేశారు. అదూరు శ్రీచరణ్‌, కృష్ణయ్యను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు. సైదాపురం మండలం జోగుపల్లిలో మాకు 240 ఎకరాలు ఉంది. అక్కడ 8 గనులు ఉన్నాయి. రెండేళ్లుగా మా పొలాల్లోని గనులను అక్రమంగా దోచేశారు. 500 నుంచి 800 కోట్ల టన్నులు తవ్వేసి రూ.వేలకోట్లు దోచుకున్నారు. లక్షల టన్నుల క్వార్జ్‌ను మార్కెట్‌లో అక్రమంగా విక్రయించారు. దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారు’’ అని సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో బద్రీనాథ్‌ పేర్కొన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని