
Ts News: కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్‌ను పరామర్శించిన హోం మంత్రి
హైదరాబాద్: మావోయిస్టుల కాల్పుల్లో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ మహేశ్‌ను రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి పరామర్శించారు. కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్ఛార్జి అవుతారని వివరించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయన్ని అందజేస్తామని హోం మంత్రి హామీ ఇచ్చారు. ములుగు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో కానిస్టేబుల్ మహేశ్ చేతికి బుల్లెట్ గాయమైంది. దీంతో అతన్ని వెంటనే హెలికాప్టర్లో హైదరాబాద్ తరలించారు. బుధవారం కానిస్టేబుల్ చేతికి శస్త్ర చికిత్స జరిగిని విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.