DRDO: నిర్మాణ రంగంలో డీఆర్‌డీఓ అద్భుతం.. 45రోజుల్లో 7 అంతస్తుల భవనం

రక్షణ పరిశోధన అభివృధ్ధి సంస్ధ(డీఆర్‌డీవో) మరో మైలు రాయి సాధించింది. కేవలం 45 రోజుల వ్యవధిలో ఏడు అంతస్తుల భవనాన్ని నిర్మించింది. డీఆర్‌డీవో సొంతంగా అభివృద్ధి చేసిన హైబ్రిడ్‌ టెక్నాలజీని ..

Updated : 17 Mar 2022 18:54 IST

హైదరాబాద్‌: రక్షణ పరిశోధన అభివృధ్ధి సంస్ధ(డీఆర్‌డీవో) మరో మైలు రాయి సాధించింది. కేవలం 45 రోజుల వ్యవధిలో ఏడు అంతస్తుల భవనాన్ని నిర్మించింది. డీఆర్‌డీవో సొంతంగా అభివృద్ధి చేసిన హైబ్రిడ్‌ టెక్నాలజీని ఉపయోగించి ప్రీకాస్ట్‌ విధానంలో భవాన్ని బెంగళూరులో నిర్మించింది. అధునాతన యుద్ధ విమానాలు, మానవ రహిత విమానాల అభివృద్ధి, పరిశోధనల కోసం ఈ భవనాన్ని నిర్మించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం ఈ భవనాన్ని ప్రారంభించారు.

ప్రీ ఇంజినీరింగ్‌, ప్రీకాస్ట్‌ మెథడాలజీతో నిర్మాణాన్ని గతేడాది నవంబరు 22న ప్రారంభించారు.  స్ట్రక్చరల్‌ ఫ్రేమ్‌ కాలమ్‌, బీమ్‌లను స్టీల్‌ ప్లేట్లతో నిర్మించారు. స్లాబ్‌లు పాక్షికంగా ముందే సిద్ధం చేసి ఉంచారు. అన్నీ తీసుకొచ్చి చక చకా అమర్చడంతో ఫిబ్రవరి 1 నాటికి పూర్తి చేశారు. 1.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనం 45 రోజుల్లో పూర్తి చేయడంతో డీఆర్‌డీవో కొత్త రికార్డు సృష్టించింది. నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ ప్రకారమే విద్యుత్ వ్యవస్థ, ఫైర్‌ ప్రొటెక్షన్‌, ఎయిర్‌ కండిషనింగ్‌ విధానం అమర్చారు. ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ రూర్కీ బృందాలు డిజైన్‌, సాంకేతిక సహాయాన్ని అందించాయి. సంప్రదాయ నిర్మాణంతో పోలిస్తే హైబ్రిడ్‌ టెక్నాలజీతో సమయం, శ్రమ తగ్గుతుందని డీఆర్‌డీవో ఛైర్మన్‌ జి.సతీష్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా డీఆర్‌డీవో బృందాన్ని అభినందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని