Diabetes: ప్రోటీన్లతో మధుమేహం దూరం..! ఎలాగో తెలుసా..?

ఒక వయసు వచ్చిన తర్వాత వ్యాయామం చేయడానికి సమయం లేకపోవడం..బరువు బాధ్యతలు పెరగడం..శరీరంలో వచ్చే మార్పులతో పాటు వచ్చే మధుమేహం నియంత్రణకు ఎన్నో ప్రయత్నాలు చేయని వారుండరు. వైద్య పరిశోధకులు కూడా ఎన్నో సూచనలు చేస్తూనే ఉన్నారు.

Published : 29 Sep 2022 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక వయసు వచ్చిన తర్వాత వ్యాయామం చేయడానికి సమయం లేకపోవడం.. బరువు బాధ్యతలు పెరగడం.. శరీరంలో వచ్చే మార్పులతో పాటు వచ్చే మధుమేహాన్ని నియంత్రించుకొనేందుకు ప్రయత్నాలు చేయని వారుండరు. వైద్య పరిశోధకులు కూడా ఎన్నో సూచనలు చేస్తూనే ఉన్నారు. మందులు, జీవన శైలిలో మార్పులు చేయడంతో పాటు ప్రోటీన్లతోనూ మధుమేహం అదుపులోకి తెచ్చుకోవచ్చని జనరల్‌ ఫిజిషియన్‌, డయాబెటాలజిస్ట్‌ డాక్టర్‌ దిలీప్‌ నందమూరి వివరించారు.

ఈ మార్పులు చేసి చూడండి..

ఆహారంలో పిండి పదార్థాలు తగ్గించుకోవడమే కాదు.. ప్రోటీన్లను పెంచుకోవడం ఎంతో కీలకం. మధుమేహానికి దోహదం చేసే ప్రతి పనిలో ప్రోటీన్లే ఉంటాయి. గ్లూకోజ్‌ కూడా ఒక ప్రోటీనే.. ఇన్సులిన్‌ హార్మోన్‌ కూడా ఒక ప్రోటీనే సుమా. శరీరంలో కొవ్వు పేరుకొని పోవడంతో ప్రోటీన్ల సామర్థ్యం తగ్గుతుంది. రోజువారీ ఆహారంలో వీటిని పెంచుకుంటే షుగర్‌ వ్యాధి అదుపులోకి వస్తుంది. భోజనంలో కార్బోహైడ్రేట్స్‌, కొవ్వులు, ప్రోటీన్‌ అవసరం ఉన్నంత తీసుకోవాలి. రోజూ 50 గ్రాముల ప్రోటీన్‌ తీసుకుంటే మంచిది. అంతకంటే ఎక్కువ తీసుకుంటే కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. మాంసం, గుడ్డు, ఆకుకూరలు, పప్పులు, పన్నీర్‌లలో ప్రోటీన్‌ లభిస్తుంది. వీటిని సమపాళ్లలో తీసుకోవడంతో మధుమేహం పెరగకుండా చూసుకోవచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు