Train Accident: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం.. పలు రైళ్ల రద్దు, కొన్ని దారి మళ్లింపు
ఒడిశాలో జరిగిన కోరమండల్ రైలు ప్రమాదం ఘటనతో పలు రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఒడిశాలో రెండు ప్రయాణికుల రైళ్లు, ఒక గూడ్స్ రైలు ఢీకొని పట్టాలు తప్పిన ఘటనలో దాదాపు 120 మంది మృతి చెందగా, 800కి పైగా గాయపడ్డారు. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు రైల్వే శాఖ సహాయ సిబ్బంది, అవసరమైన కొన్ని మందులు ప్రత్యే రైళ్ల ద్వారా తరలిస్తోంది. ప్రమాద ఘటనతో ట్రాక్ దెబ్బతినడం, సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. మరి కొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు. రైళ్ల రాకపోకలు తెలుసుకునేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను కూడా అధికారులు అందుబాటులో ఉంచారు. ఈ నెల 3న ప్రయాణించాల్సిన హావ్‌డా- సికింద్రాబాద్(12703) ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్ , హావ్‌డా-హైదరాబాద్(18045) ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్, హావ్‌డా-తిరుపతి(20889) హంసఫర్ రైల్‌ను రైల్వే శాఖ రద్దు చేసింది.
రద్దైన రైళ్లు..
హావ్‌డా-ఎస్‌ఎమ్‌వీటీ బెంగళూరు(12863), హావ్‌డా- చెన్నై సెంట్రల్(12839), హావ్‌డా-సికింద్రాబాద్(12703), హావ్‌డా-ఎస్‌ఎమ్‌వీటీ బెంగళూరు(12245), షాలిమార్-హైదరాబాద్(18045), హావ్‌డా-తిరుపతి(20889), ఎస్‌ఎమ్‌వీటీ బెంగళూరు-గువహాటి(12509), చెన్నై సెంట్రల్-షాలిమార్(12842), కన్యాకుమారి-హావ్‌డా(1266) రైళ్లు రద్దయ్యాయి.
దారి మళ్లింపు చేసినవి..
సంత్రగాచి-చెన్నై సెంట్రల్(22807), హావ్‌డా-మైసూర్(22817)ను టాటా మీదుగా, చెన్నై సెంట్రల్-హావ్‌డా(12840), వాస్కోడగామా-హావ్‌డా(18048) రైళ్లను జరోలి మీదుగా, సికింద్రాబాద్-షాలిమార్(22850)ను జఖాపురా-జరోలీ మీదుగా, ఎస్‌ఎమ్‌వీటీ బెంగళూరు-గువహాటి(12509)ను విజయనగరం, టిట్లాఘడ్, జార్సుగూడ, టాటా మీదుగా మళ్లించనున్నారు. తంబరం-న్యూతిన్సుకియా(15929)ను రనిటాల్-జరోలి మీదుగా, సిల్చర్-త్రివేండ్రమ్(12508), దిబుర్‌ఘడ్-కన్యాకుమారి(22504)ను ఖరగ్‌పుర్-టాటా-రౌర్ఖేలా మీదుగా, న్యూజల్పాయిగురి-చెన్నై సెంట్రల్(22612)ను అసన్‌సోల్-అనర-చండిల్-సొనియానా-రౌర్ఖేలా మీదుగా, దిబుర్‌ఘఢ్-సికింద్రాబాద్(07047)రైలును బాటానగర్-ఖరగ్‌పుర్-టాటా-రౌర్ఖేలా మీదుగా దారి మళ్లించనున్నారు.హైదరాబాద్-షాలిమార్(18004)ను మూడు గంటల ఆలస్యంతో రీషెడ్యూల్డ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: వన్డే వరల్డ్ కప్.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్‌కు చోటు
-
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
-
Siddharth: సిద్ధార్థ్‌కు చేదు అనుభవం.. ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో
-
Nitin Gadkari: ఏడాది చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు: నితిన్ గడ్కరీ
-
Adilabad: గణేశ్ నిమజ్జనంలో సందడి చేసిన WWE స్టార్
-
Ramesh Bidhuri: భాజపా ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ సిఫార్సు