కరోనా బాధితుల ఫ్లాష్‌మాబ్‌!

రోనా బారిన పడితే సర్వం కోల్పోయామని భావిస్తుంటారు కొందరు. ఆస్పత్రిలో చేరినంత మాత్రాన ఏదో అయ్యిందని అనుకుని మరింత కుంగిపోతుంటారు. సాధారణంగా కరోనా బారిన పడిన వారి ఆలోచనలు ఇలానే ఉంటాయి. అందులోనూ ఈ మహమ్మారి బారిన పడినప్పుడు.......

Published : 20 Jul 2020 16:19 IST

బళ్లారి: కరోనా బారిన పడితే సర్వం కోల్పోయామని భావిస్తుంటారు కొందరు. ఆస్పత్రిలో చేరినంత మాత్రాన ఏదో అయ్యిందని అనుకుని మరింత కుంగిపోతుంటారు. సాధారణంగా కరోనా బారిన పడిన వారి ఆలోచనలు ఇలానే ఉంటాయి. అందులోనూ ఈ మహమ్మారి బారిన పడినప్పుడు ఆత్మస్థైర్యం కోల్పోకూడదనేది వైద్యులు పదే పదే చెబుతున్న మాట. అందుకే కర్ణాటక బళ్లారిలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్వాహకులు వినూత్న ఆలోచన చేసి కరోనా బాధితుల్లో  ఉత్తేజం నింపారు.

కరోనా నేపథ్యంలో బళ్లారిలోని ప్రభుత్వ డెంటల్‌ కాలేజీని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చారు. కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్‌ తేలిన వారి కోసం దీన్ని ప్రత్యేకించారు. ఇందులో చికిత్స పొందుతున్న వారంతా కొద్దిరోజులుగా ఇంటికి దూరంగా ఉంటున్నారు. వారిలో ఒంటరితనం పోగొట్టి వారిలో ఉత్సాహం నింపేందుకు ఆ సెంటర్‌ నిర్వాహకులు ఆదివారం ఫ్లాష్‌మాబ్‌ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోమవారం బయటకొచ్చింది. కన్నడతో పాటు, పలు బాలీవుడ్‌ చిత్రాలకు బాధితులంతా నృత్యాలు చేశారు. భౌతిక దూరం పాటిస్తూనే మాస్కులు ధరిస్తూ పాటలకు చిందేశారు. అక్కడి సిబ్బంది సైతం ఇందులో పాల్గొన్నారు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని