AP: కొత్తగా 14వేల కరోనా పాజిటివ్‌ కేసులు

సోమవారం పాజిటివ్‌ కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 60,124 శాంపిల్స్‌ పరీక్షించగా, 14,986 మంది కరోనా బారినపడ్డారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Updated : 10 May 2021 17:26 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 14వేల మంది కరోనా బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం 60,124 శాంపిల్స్‌ పరీక్షించగా, 14,986 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనాతో బాధపడుతూ 84మంది మృతి చెందారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 2,352 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా పశ్చిమగోదావరిలో 423మంది కరోనా బారినపడ్డారు. గడిచిన 24 గంటల్లో 16,167మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,74,28,059 శాంపిల్స్‌ను పరీక్షించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1,89,367 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొవిడ్‌ వల్ల పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో 12మంది చొప్పున చనిపోగా, తూర్పుగోదావరి 10, విశాఖ 9, నెల్లూరు 8, విజయనగరం 8, చిత్తూరు 6, కర్నూలు 6, కృష్ణా 4, శ్రీకాకుళం 4, అనంతపురం 3, కడపలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 8,791కు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని