Telangana News: కస్తూర్బా పాఠశాలలో కరోనా కలకలం.. 17 మందికి పాజిటివ్‌

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని నేరేడుగొమ్ము కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో కరోనా కలకలం చోటు చేసుకుంది. ఉదయం విద్యార్థులు జ్వరం, దగ్గుతో బాధ

Published : 04 Aug 2022 14:48 IST

దేవరకొండ: నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని నేరేడుగొమ్ము కస్తూర్బా గాంధీ పాఠశాలలో కరోనా కలకలం రేగింది. ఉదయం విద్యార్థులు జ్వరం, దగ్గుతో బాధ పడుతుండటంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది వైద్య శాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో వైద్య సిబ్బంది కస్తూర్బా పాఠశాలకు వచ్చి 20మంది విద్యార్థినులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 16మంది విద్యార్థినులకు, ఒక ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రిన్సిపల్ గీత విద్యార్థినుల తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు