Covid Update: తెలంగాణలో కరోనా ఉద్ధృతి... ఒక్కరోజే 493 కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి గత కొన్ని రోజులుగా విజృంభిస్తోంది. ఇవాళ 29,084 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 493 పాజిటివ్‌ కేసులుతెలంగాణలో కరోనా మహమ్మారి గత కొన్ని రోజులుగా విజృంభిస్తోంది. ఇవాళ 29,084 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 493 పాజిటివ్‌ కేసులు

Published : 24 Jun 2022 19:25 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి గత కొన్ని రోజులుగా విజృంభిస్తోంది. ఇవాళ 29,084 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 493 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి శుక్రవారం 219 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,332 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ కొత్తగా 336 కేసులు నమోదయ్యాయి. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(Bala krishna) కరోనా బారినపడ్డారు. తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌ నిర్ధారణ కావటంతో హోం ఐసోలేషన్‌కు వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని