TS NEWS: కొత్తగా 748 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 81,405 మంది నమూనాలు పరీక్షించగా... కొత్తగా 748 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Published : 27 Jun 2021 20:10 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 81,405 మంది నమూనాలు పరీక్షించగా... కొత్తగా 748 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,635కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 1,492 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,302 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 121 కేసులు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని