
TS News: చెన్నూరు బస్టాండ్‌లో కలకలం.. డ్యూటీలో ఉన్న కండక్టర్‌కు కరోనా
చెన్నూరు: తెలంగాణలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా చెన్నూరు బస్టాండ్‌లో చేసిన పరీక్షలో డ్యూటీలో ఉన్న మహిళా కండక్టర్‌కు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... హనుమకొండ డిపోకు చెందిన బస్సు ఈరోజు ఉదయం 11గంటలకు చెన్నూరుకు వచ్చింది. ప్రయాణికులంతా బస్సు దిగి వెళ్లిపోయారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో చెన్నూరు బస్టాండ్‌లో కొవిడ్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఆసమయంలో ఒంట్లో నలతగా ఉండటంతో తనకు కొవిడ్ పరీక్ష చేయమని మహిళా కండక్టర్ కోరారు. ఇందులో ఆమెకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. వెంటనే బస్సును హనుమకొండ డిపోకు ఖాళీగా పంపించారు. అప్పటికే ప్రయాణికులు ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.