
Updated : 19 Jan 2022 10:13 IST
TS News: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర దంపతులకు కరోనా.. నిన్న మంత్రులతో పర్యటన
భూపాలపల్లి: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన భార్య జ్యోతి కరోనా బారిన పడ్డారు. జ్వరం రావడంతో వీరు నిన్న రాత్రి కొవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ఎమ్మెల్యే దంపతులు నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లితో కలిసి పర్యటించారు. అనంతరం నిరంజన్‌రెడ్డితో పాటే గండ్ర హెలికాప్టర్లో హైదరాబాద్‌కు వెళ్లారు.
Tags :