
Updated : 18 Jan 2022 10:29 IST
Chandrababu: తెదేపా అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కరోనా బారినపడ్డారు. కొవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా నిర్ధరణ కావడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు హోంఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల కాలంలో తనకు సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు చంద్రబాబు కుమారుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు నిన్న కొవిడ్ నిర్ధరణ అయిన విషయం తెలిసిందే.
దేవినేని ఉమకు కొవిడ్
మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నానని చెప్పారు. పాజిటివ్‌గా తేలడంతో హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.
Tags :