కరోనా పరీక్షలా? ఇక్కడ చేస్తారు!

గ్రేటర్‌ వ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో పరీక్షలు చేస్తున్నట్లు

Published : 29 Jul 2020 09:57 IST

 హైదరాబాద్‌: గ్రేటర్‌ వ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో పరీక్షలు చేస్తున్నట్లు తాజాగా వైద్య ఆరోగ్యశాఖ అధికారిక జాబితాను విడుదల చేసింది. ఈ కేంద్రాల్లో ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలతోపాటు ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేస్తున్న ప్రైవేటు ల్యాబ్‌ల వివరాలనూ వెల్లడించింది. ప్రజలు కరోనా పరీక్షలను ఇక్కడ చేయించుకోవాలని సూచించింది. ఆ వివరాలివీ..

ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేసే

ప్రభుత్వ ఆసుపత్రులు, పరిశోధన సంస్థలు..

గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌ ఆసుపత్రి, నిమ్స్‌, ఐపీఎం (నారాయణగూడ), ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీ, సీసీఎంబీ (తార్నాక), సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌, డయోగ్నోస్టిక్స్‌, రైల్వే ఆసుపత్రి (లాలాగూడ)

ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేసే ప్రైవేటు ల్యాబ్‌లు

విజయా డయోగ్నోస్టిక్స్‌, మెడసిస్‌ పాథ్‌ల్యాబ్స్‌, అపోలో ఆసుపత్రి (జూబ్లీహిల్స్‌), డాక్టర్‌ రెమిడీస్‌, సెల్‌ కరెక్ట్‌ డయోగ్నోస్టిక్స్‌, పాథ్‌కేర్‌, కిమ్స్‌, ఏఐజీ ఆసుపత్రి, అపోలో హెల్త్‌ కేర్‌ (సికింద్రాబాద్‌), యశోద (సికింద్రాబాద్‌), కామినేని (మౌలాలి), లూసిడ్‌, మ్యాప్‌మైజినోమ్‌, టెనెట్‌ డయోగ్నోస్టిక్స్‌, విమ్టా ల్యాబ్స్‌, అమెరికన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పాథాలజీ, మేగ్‌సేన్‌ డయోగ్నోస్టిక్స్‌, స్టార్‌ ఆసుపత్రి, గ్లనికల్‌ గ్లోబల్‌, కాంటినెంటల్‌ ఆసుపత్రుల ల్యాబ్‌లు.

రంగారెడ్డి జిల్లాలో అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు, పీహెచ్‌సీలు..

సరూర్‌నగర్‌, బాలాపూర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, రంగనాయకకుంట, మన్సూరాబాద్‌, శివరాంపల్లి, హసన్‌నగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, హఫీజ్‌పేట్‌, ఉప్పరపల్లి, రాయదుర్గం, నందనవనం, శేరిలింగంపల్లి, నార్సింగి, కందుకూర్‌, మెయినాబాద్‌, కొందుర్గు, ఆమన్‌గల్‌, యాచారం, కొత్తూరు.

మేడ్చల్‌ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాలు..

మల్కాజిగిరి (ఏరియా ఆసుపత్రి), మేడ్చల్‌ (పీహెచ్‌సీ).

పీహెచ్‌సీలు- అల్వాల్‌, బాలానగర్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌, కుషాయిగూడ, జవహర్‌నగర్‌, నారపల్లి, దుండిగల్‌, శ్రీరంగవరం, శామీర్‌పేట, కీసర, ముదుచింతపల్లి.

యూపీహెచ్‌సీలు- మచ్చబొల్లారం, సుభాష్‌నగర్‌, పర్వత్‌నగర్‌, మూసాపేట, జగద్గిరిగుట్ట, ఎల్లమ్మబండ, హస్మత్‌పేట్‌, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, షాపూర్‌నగర్‌, గాజులరామారం, సురారం కాలనీ, వినాయకనగర్‌, ఏకలవ్యనగర్‌, మౌలాలి, సఫిల్‌గూడ, మల్లాపూర్‌, వెంకట్‌రెడ్డినగర్‌, నాగోలు, కొత్తపేట్‌, చర్లపల్లి, పీర్జాదిగూడ, మేడ్చల్‌, బోడుప్పల్‌.

బస్తీ దవాఖానాలు- అంబేడ్కర్‌నగర్‌ (గాజులరామారం), అంజయ్యనగర్‌ (బోయినపల్లి), బీజేఆర్‌నగర్‌, బాగ్‌మీరి కమ్యూనిటీ హాల్‌, బాలాజీనగర్‌ (మూసాపేట), చాకలి కుమ్మరి బస్తీ (కూకట్‌పల్లి), ఇందిరాగాంధీపురం, జీడిమెట్ల, కైత్లాపూర్‌, న్యూశివాలయ (సూరారం), రాజీవ్‌గాంధీనగర్‌ (మూసాపేట), వాల్వర్‌నగర్‌ (నాచారం), ఎల్లమ్మబండ, జింకల్‌వాడ (మూసాపేట), అంబేడ్కర్‌నగర్‌ (కొత్తబస్తీ), అరుంధతి కమ్యూనిటీ హాల్‌ (అల్వాల్‌), మోడల్‌ మార్కెట్‌ (తుర్కపల్లి), ద్వారకానగర్‌ (కుత్బుల్లాపూర్‌), నందన్‌నగర్‌, భగత్‌సింగ్‌నగర్‌ (చింతల్‌), కేపీహెచ్‌బీ 5వ ఫేజ్‌, పాపిరెడ్డినగర్‌, వెంకటేశ్వర కమ్యూనిటీ హాల్‌, ఎర్రకుంట, ఇందిరానగర్‌ (నాచారం), ఎల్‌ఎన్‌కాలనీ, మర్రిగూడ (మల్లారం), పెద్దచర్లపల్లి (కాప్రా), రాజీవ్‌నగర్‌ (కాప్రా), ఎస్సీ కమ్యూనిటీహాల్‌ (చిల్కానగర్‌), సాయిబాబానగర్‌ (దమ్మాయిగూడ), వివేక్‌నగర్‌ (రామాంతాపూర్‌), మహిళా మండలి భవన్‌ (కుషాయిగూడ), సాయిరాం నగర్‌ కమ్యూనిటీ హాల్‌ (కుషాయిగూడ), అశోక్‌నగర్‌ (కాప్రా), సింగంచెరువు (కాప్రా), స్వామి వివేకానందనగర్‌ (కాప్రా).

హైదరాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు,

యూపీహెచ్‌సీలు..

ప్రభుత్వ ఆసుపత్రులు- ఆయుర్వేద ఆసుపత్రి, నేచర్‌క్యూర్‌, సరోజినీదేవి నేత్ర వైద్యశాల, నిజామియా టిబ్బి ఆసుపత్రి (చార్మినార్‌), మలక్‌పేట, నాంపల్లి, గోల్కొండ (ఏరియా ఆసుపత్రులు).

యూపీహెచ్‌సీలు- బండ్లగూడ, బార్కస్‌, మైసారం, పార్వతీనగర్‌, ఉప్పుగూడ, బాలాగంజ్‌, చందులాల్‌ బారాదరి, తీగలకుంట, జహనుమా, చార్మినార్‌, ఉమ్డాబజార్‌, అలియాబాద్‌, ఈద్‌బజార్‌, ఆమన్‌నగర్‌, పంజేషా-1, నయాపూల్‌, తారామైదాన్‌, కామాటిపుర, పంజేషా-2, డబీర్‌పురా, దారూషిఫా, అజంపురా, యూకుత్‌పురా-1, యాకుత్‌పురా-2, మలక్‌పేట, జాంబాగ్‌ పార్క్‌, మాదన్నపేట, గడ్డిఅన్నారం, శాలివాహననగర్‌, బాగ్‌అంబర్‌పేట్‌, ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌, ఎఎంఎస్‌, హర్రాజ్‌పెంట, తిలక్‌నగర్‌, పురానాపుల్‌-1, పురానాపుల్‌-2, పానీపురా, కార్వాన్‌-2, మహరాజ్‌గంజ్‌, దూద్‌బౌలి, కిషన్‌బాగ్‌, బేగంబజార్‌, అఫ్జల్‌సాగర్‌, చింతల్‌బస్తీ, సయ్యద్‌నగర్‌, నాంపల్లి, నిలోఫర్‌, ఆఘాపురా, శాంతినగర్‌, ఖైరతాబాద్‌, కుమ్మర్‌వాడి, ఫిల్మ్‌నగర్‌, గుడిమల్కాపూర్‌, కార్వాన్‌-1, గోల్కొండ, గగన్‌మహల్‌, డీబీఆర్‌ మిల్స్‌, బొగ్గులకుంట, సుల్తాన్‌బజార్‌, ఇసామియా బజార్‌, ఆర్‌హెచ్‌ అండ్‌ ఎఫ్‌డబ్ల్యుటీసీ, శ్రీరాంనగర్‌, బోరబండ, షౌకత్‌నగర్‌, బంజారాహిల్స్‌, వినాయక్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, ఈఎస్‌ఐ, అమీర్‌పేట్‌, సనత్‌నగర్‌, పంజాగుట్ట, బోయిగూడ, చుట్టల్‌బస్తీ, మెట్టుగూడ, మహ్మద్‌గూడ, తుకారంగేట్‌, అడ్డగుట్ట, పాన్‌బజార్‌, డాక్టర్‌ పాల్‌దాస్‌, గరీబ్‌నగర్‌, బైబిల్‌హౌస్‌, బోయినపల్లి, తిరుమలగిరి, పికెట్‌, బొల్లారం, రసూల్‌పుర.


ఇవి తెలుసుకోండి..

* అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాలు, యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్షలు ఉచితంగా చేస్తారు.

* ప్రైవేటు ల్యాబ్‌ల్లో మాత్రం ఒక ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షకు రూ.2300 (ప్రభుత్వం నిర్ణయించిన ధర) చెల్లించాలి. ఇంటికి వచ్చి నమూనాలు తీసుకోవాలంటే అదనంగా ఖర్చవుతుంది.

* కొన్నిచోట్ల ముందురోజే టోకెన్‌ తీసుకోవాలి. కొన్ని కేంద్రాల వద్ద మాత్రం అదేరోజు ఉదయం టోకెన్లు ఇచ్చి పరీక్షలు చేస్తున్నారు.

* పరీక్షకు వెళ్లేటప్పుడు చిరునామా, ఆధార్‌నెంబర్‌, సెల్‌నెంబరు తప్పనిసరి.

* అందరూ మాస్క్‌లు, చేతికి గ్లౌజులు ధరించి వెళ్లాలి. 6 అడుగుల ఎడం పాటిస్తూ నిల్చోవాలి.

* పాజిటివ్‌ వస్తే అదేరోజు సాయంత్రం లేదా తెల్లారి ఉదయం ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపుతారు.

* ధ్రువపత్రం అదే సెంటర్‌లో తీసుకోవచ్ఛు ఎస్‌ఎంఎస్‌ లేదా ధ్రువపత్రం ఉంటేనే ఆసుపత్రిలో చేర్చుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని