Ap Corona update: ఏపీలో స్వల్పంగా పెరిగిన కొవిడ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో నిన్నటితో పోల్చితే కొవిడ్‌ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 70,695 పరీక్షలు నిర్వహించగా.. 2,010 కేసులు నిర్ధారణ అయ్యాయి

Published : 28 Jul 2021 18:25 IST

బులెటిన్‌ విడుదల చేసిన వైద్యారోగ్య శాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిన్నటితో పోల్చితే కొవిడ్‌ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 70,695 పరీక్షలు నిర్వహించగా.. 2,010 కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 470 కేసులు అదనంగా నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,59,942 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 20 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,312కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,956 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,25,631కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,999 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,43,24,626 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని