Corona update: తెలుగు రాష్ట్రాల్లో కొత్త కొవిడ్‌ కేసులెన్నంటే?

తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు.  ఇంకా అక్కడక్కడా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఏపీలో తాజాగా 5508 సాంపిల్స్‌ పరీక్షించగా.. 26మందికి ...

Updated : 14 Mar 2022 19:42 IST

అమరావతి/హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు.  ఇంకా అక్కడక్కడా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఏపీలో తాజాగా 5508 సాంపిల్స్‌ పరీక్షించగా.. 26మందికి పాజిటివ్‌గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. అలాగే, తాజాగా 85 మంది కోలుకోగా.. ఒక్క మరణం కూడా సంభవించలేదని తెలిపారు. రాష్ట్రంలో అనంతపురంలో ఎనిమిది కేసులు వెలుగుచూడగా.. తూర్పుగోదావరిలో 7, పశ్చిమగోదావరిలో నాలుగు, విశాఖ, గుంటూరు జిల్లాల్లో రెండు చొప్పున, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 3,32,67,581 టెస్టులు చేయగా.. 23,18,884 మందికి పాజిటివ్‌గా తేలింది.వీరిలో 23,03,607 మంది కోలుకోగా.. 14,730మంది మరణించారు. ప్రస్తుతం 547 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

మరోవైపు, తెలంగాణలో ఈరోజు 67 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంంటల వ్యవధిలో 21,843 టెస్టులు చేయగా.. 67మందిలో వైరస్‌ బయటపడింది. తాజాగా 152 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. కొత్తగా మరణాలేమీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,38,76,145 టెస్టులు చేయగా.. 7,90,418 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 7,85,442 మంది కోలుకోగా.. 4111 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 865 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని