Corona: తెలంగాణలో ఆగని వైరస్‌ ఉద్ధృతి

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ సహా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం...

Updated : 17 May 2021 19:36 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ సహా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం కొత్తగా దాదాపు నాలుగు వేల కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24గంటల వ్యవధిలో 62,591 శాంపిల్స్‌ పరీక్షించగా.. 3961 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 30మంది మరణించగా.. 5559మంది కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలుపుకొంటే రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,32,784కి చేరాయి. వీరిలో 4,80,458మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 2985మంది కొవిడ్‌తో మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 49,341 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 90.17శాతం ఉండగా.. మరణాల రేటు 0.56శాతంగా ఉంది.  ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సోమవారం 631 కొత్త కేసులు వచ్చాయి. 

జిల్లాల వారీగా కొత్త కేసులు ఇలా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని