Andhra news: కడుపులో కేజీ కాటన్‌.. అలాగే కుట్లు వేశారు!

వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదికి తెచ్చింది. కోరాపుట్ జిల్లా బిరిగుడ గ్రామానికి చెందిన హలబ అనే మహిళకు ఒడిశాలోని రాయగడ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు.

Updated : 24 Mar 2022 14:42 IST

విశాఖపట్నం: వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదికి తెచ్చింది. కోరాపుట్ జిల్లా బిరిగుడ గ్రామానికి చెందిన హలబ అనే మహిళకు ఒడిశాలోని రాయగడ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అనంతరం మీటర్ పొడవున్న కాటన్ ఆమె కడుపులోనే వదిలేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత బాధితురాలికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆపరేషన్‌ చేసిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు మరోమారు తమ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఇది సాధారణ కడుపు నొప్పని చెప్పి పంపేశారు.

నొప్పి తీవ్రం కావడంతో బాధితురాలు మరో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొన్నారు.  ఈ క్రమంలోనే మీటరు పొడవైన కాటన్‌ ఉన్నట్లు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు విశాఖలోని ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి, కాటన్‌ను తొలగించారు. తమకున్న భూమి, బంగారాన్ని తాకట్టు పెట్టి ఆపరేషన్‌ చేయించినట్లు బాధిత కుటుంబం వాపోయింది. వైద్యుల నిర్లక్ష్యంపై రాయగడ ఆసుపత్రి ఉన్నతాధికారులను వివరణ కోరగా దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొన్నారు..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని