డే లైట్ సేవింగ్ టైమ్ గురించి తెలుసా..?
ఇంటర్నెట్ డెస్క్: ఒక్కో దేశంలో ఒక్కో సమయం ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రాంతాల్ని బట్టి పగలు, రాత్రిలో హెచ్చుతగ్గులుంటాయి. ఈ క్రమంలో కొన్ని దేశాలు ఏటా రెండు సార్లు గడియారంలో కాలాన్ని మార్చేస్తుంటాయి. ఎందుకో తెలుసా..?
భూమధ్య రేఖకు కాస్త అటు ఇటుగా ఉన్న దేశాలకు పగలు, రాత్రి దాదాపు 12 గంటల చొప్పున సమంగా ఉంటాయి. మిగతా దేశాల్లో పగటి సమయం వేసవికాలంలో ఎక్కువగానూ, శీతాకాలంలో తక్కువగానూ ఉంటుంది. దీంతో పగటి పూటను ప్రజలు ఎక్కువసేపు ఆస్వాదించడం కోసం ‘డే లైట్ సేవింగ్ టైం’ విధానాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం.. ఏటా వేసవి కాలం (మార్చి చివరి ఆదివారం) గడియారంలో ఉండే అంతర్జాతీయ ప్రామాణిక సమయాన్ని ఒక గంట ముందుకు జరుపుతారు. శీతాకాలం ప్రారంభం (అక్టోబర్ చివరి వారం)లో మళ్లీ వెనక్కి జరిపి యథాస్థితికి తీసుకొస్తారు.
సాధారణంగా ఉద్యోగులు, కార్మికులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తారు. వేసవికాలంలో సమయాన్ని గంట ముందుకు జరపడం వల్ల ఉదయం 8 గంటల నుంచి 4 గంటల మధ్య పని చేసి తొందరగా ఇంటికి వెళ్తారు (గడియారం పరంగా 9am-5pm పనివేళలే). సాయంత్రం ఇంకా వెలుగు ఉంటుంది కాబట్టి కుటుంబంతో బయటకు విహారానికి వెళ్తారు. తద్వారా ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు, విద్యుత్ పరికరాల వినియోగం తక్కువవుతుంది. ఈ విధంగా విద్యుత్ ఆదా అవుతుంది. అలాగే సాయంత్రం వేళ విహారానికి వెళ్లే కుటుంబాల వల్ల మార్కెట్లో కొనుగోళ్లు పెరుగుతాయి. అలా ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగవుతుంది. ఈ ఉద్దేశంతోనే పలు దేశాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి.
ఈ ‘డే లైట్ సేవింగ్ టైం’ను 1895లో జార్జ్ హడ్సన్ అనే కీటకాల శాస్త్రవేత్త ప్రతిపాదించారు. తన కార్యాలయంలో పని పూర్తికాగానే కీటకాల వేటకు వెళ్లేవాడట. కానీ, పనివేళలు ముగిసేసరికి కొన్ని సార్లు చీకటి పడుతుండటంతో గడియారంలో సమయాన్ని గంట వెనక్కి జరిపితే సాయంత్రం వేళ వెలుగు ఉన్నప్పుడు వేటకు వెళ్లొచ్చని భావించాడు. అందుకే ‘డే లైట్ సేవింగ్ టైం’ ప్రతిపాదన తీసుకొచ్చాడు. అయితే, అంతకుముందే అమెరికాకు చెందిన శాస్త్రవేత్త, రాజకీయ నాయకుడు బెంజిమన్ ఫ్రాంక్లిన్ 1784లో ఈ విధానాన్ని ప్రతిపాదించినట్లు ఓ వాదన ఉంది. కొవ్వొత్తుల వినియోగం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వాటి కొనుగోళ్లు, ఖర్చులు తగ్గించడం కోసం దీనిని తీసుకొచ్చారట.
తొలిసారి 1916లో జర్మనీ, ఆస్ట్రియా-హంగేరీలు, ఆ తర్వాత యూరప్, అమెరికా ఈ విధానాన్ని అమలు చేశాయి. రెండు ప్రపంచ యుద్ధాల కాలంలో జర్మనీ ఈ విధానాన్ని ఇంధనం, సైనిక శక్తిని పొదుపు చేయడం కోసం బాగా ఉపయోగించుకుంది. అయితే ఈ ‘డే లైట్ సేవింగ్ టైం’ విధానం తప్పనిసరి కాదు. కానీ, 70కి పైగా దేశాలు పాటిస్తున్నాయి. భారత్ సహా ఆసియా, ఆఫ్రికా దేశాలు దీన్ని పాటించట్లేదు. అమెరికాలోనూ కొన్ని ప్రాంతాలు ఈ ‘డే లైట్ సేవింగ్ టైం’కు దూరంగా ఉంటున్నాయి. అప్పట్లో అయితే.. లైట్లు, ఫ్యాన్లు, ఆ నాటి విద్యుత్ పరికాల వినియోగం తగ్గించి, విద్యుత్ ఆదా కోసం ఈ విధానం అమలు చేశారు. ప్రస్తుతం 24 గంటలూ ఏదో విధంగా విద్యుత్ వినియోగం ఉంటోంది. మరి ఈ విధానం వల్ల లాభం ఉందా అంటే? ఉందని కొందరు.. లేదని కొందరు వాదిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
-
World News
Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
-
India News
Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
-
Sports News
T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
-
Viral-videos News
Viral Video: రోడ్డుపై నీటి గుంత.. అందులోనే స్నానం చేస్తూ వ్యక్తి నిరసన!
-
Movies News
Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Gali Janardhana Reddy: ‘గాలి’ అడిగితే కాదంటామా!
- Arthroscopy: మీ మోకీలుకు నొప్పి ఎక్కువగా ఉందా..? ఏం చేయాలో తెలుసా..!
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Viral Video: రోడ్డుపై నీటి గుంత.. అందులోనే స్నానం చేస్తూ వ్యక్తి నిరసన!