నవ దంపతులకు వినూత్న కానుక!

మీరో పెళ్లికి వెళ్తున్నారు.. కానుకగా ఏం పట్టుకెళతారు?ఏ బహుమతో, పుష్పగుచ్చమో కదా! ప్రస్తుతం ఆ ట్రెండ్‌ మారింది. ఇప్పుడు మనం వాడే నిత్యావసర

Updated : 19 Feb 2021 04:29 IST

చెన్నై: మీరో పెళ్లికి వెళ్తున్నారు.. కానుకగా ఏం పట్టుకెళతారు?ఏ బహుమతో, పుష్పగుచ్చమో కదా! ప్రస్తుతం ఆ ట్రెండ్‌ మారింది. ఇప్పుడు మనం వాడే నిత్యావసర సరకుల్లో ఏది ఎక్కువ ధర ఉంటే వాటిని వధూవరులకు పెళ్లి కానుకగా ఇస్తున్నారు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్‌, గ్యాస్‌ బండ, ఉల్లి ధరలు మండిపోతున్నాయి. రోజు రోజుకూ పెరిగిపోతున్న వీటి ధరల తీరును తెలియజెప్పేలా తమిళనాడుకు చెందిన కొందరు యువకులు వినూత్న ప్రయత్నం చేశారు. తమ మిత్రుడి పెళ్లికి వాటినే కానుకగా ఇచ్చారు.

చెన్నైకి చెందిన కార్తిక్‌, శరణ్య వివాహ వేడుకను వంగరంలోని ఓ కల్యాణ వేదికలో ఘనంగా నిర్వహించారు. వేడుకకు వెళ్లిన కొందరు యువకులు ఐదు లీటర్ల పెట్రోల్‌, గ్యాస్‌ బండను దంపతులకు బహుమతిగా ఇచ్చారు. అదేవిధంగా ఉల్లిపాయలతో చేసిన దండలను వధూవరుల మెడలో వేశారు. నవ దంపతులతోపాటు వివాహ వేడుకకు వచ్చిన వారంతా ఈ బహుమతులు చూసి నవ్వు ఆపుకోలేకపోయారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని