20 ఏళ్ల ప్రేమకు గుర్తుగా.. 2వేల డాలర్ల టిప్‌

ఇరవై ఏళ్ల క్రితం తన భార్యతో మొదటిసారి వెళ్లిన రెస్టారెంటుకు రెండు వేల డాలర్లు (సుమారు లక్షా నలభైఐదు వేల రూపాయలు) టిప్‌ ఇచ్చిన ఘటన అమెరికాలోని చికాగో నగరంలో జరిగింది. ఈ మేరకు స్థానిక క్లబ్‌ లక్కీ అనే రెస్టరెంట్‌ తన ఫేస్‌బుక్‌లో తెలిపింది.

Updated : 18 Feb 2021 04:07 IST

రెస్టారంట్‌ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన దంపతులు

చికాగో: ఇరవై ఏళ్ల క్రితం తన భార్యతో మొదటిసారి వెళ్లిన రెస్టారంటుకు రెండు వేల డాలర్లు (సుమారు లక్షా నలభైఐదు వేల రూపాయలు) టిప్‌ ఇచ్చిన ఘటన అమెరికాలోని చికాగో నగరంలో జరిగింది. ఈ మేరకు స్థానిక క్లబ్‌ లక్కీ అనే రెస్టరెంట్‌ తన ఫేస్‌బుక్‌లో తెలిపింది. వివరాల్లోకెళ్తే.. చికాగోకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను మొదటిసారిగా క్లబ్‌ లక్కీ రెస్టారెంటులో కలిశారు. ఆ రోజుకు గుర్తుగా ఇరవై ఏళ్లపాటు వారు అదే హోటల్‌కు అదే రోజున ప్రతి సంవత్సరం వెళ్తూ ఉండేవారు. దీంతో ఆ రెస్టారంటు యాజమాన్యం వారికి ఒకే టేబుల్‌ను కేటాయించడం ప్రారంభించింది. తాజాగా వారిద్దరూ మొదటిసారి కలిసి ఇరవైఏళ్లైన సందర్భంగా ఆ వ్యక్తి రెండు వేల డాలర్లను టిప్‌గా ఇచ్చాడు. అంతేకాకుండా ఇరవైఏళ్లుగా తమకు అందించిన మంచి జ్ఞాపకాలకు, ఆహారానికి, సర్వీసుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బిల్‌పై రాశారు. వారు ఇచ్చిన టిప్‌ను అక్కడి సిబ్బంది అందరూ కలిసి పంచుకోవాలని ఆయన రాశారు.

ఈ విషయాన్ని క్లబ్‌ లక్కీ రెస్టారెంట్‌ ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేయడంతో వైరల్‌ అయ్యింది. ఆ దంపతుల పేర్లు వెల్లడించని హోటల్‌ యాజమాన్యం, వారి జీవితాల్లో ఈ హోటల్‌ భాగమైనందుకు ఆనందంగా ఉందని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని